మహిళ గర్భాశయంలో 106 కణితులు తొలగింపు
కణితులు | తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఓ మహిళ గర్భాశయంలో నుంచి ఢిల్లీ వైద్యులు 106 కణితులు తొలగించారు. ఢిల్లీకి చెందిన ఓ మహిళ(29) తీవ్రమైన

న్యూఢిల్లీ : తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఓ మహిళ గర్భాశయంలో నుంచి ఢిల్లీ వైద్యులు 106 కణితులు తొలగించారు. ఢిల్లీకి చెందిన ఓ మహిళ(29) తీవ్రమైన నొప్పి, రుతుస్రావంలో అధికంగా రక్తం పోవడంతో పాటు ఇతర సమస్యలను ఎదుర్కొంటుంది. హిమోగ్లోబిన్ లెవల్స్ కూడా తగ్గాయి. దీంతో ఆమె ఢిల్లీలోని బీఎల్కే మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఫిబ్రవరిలో చేరింది.
అనంతరం ఆమెకు అల్ట్రా సౌండ్ పరీక్షలు నిర్వహించగా, గర్భాశయంలో పెద్ద పెద్ద కణితులను గుర్తించారు. కణితులు ఉండటంతో ఆమె 8 నెలల గర్భిణిలా ఉంది. మొత్తానికి ఆమెను పరీక్షించిన వైద్యులు.. హిమోగ్లోబిన్ స్థాయిలను 12 mg/dl కు పెంచారు. ఆ తర్వాత నాలుగున్నర గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి 106 కణితులను తొలగించారు. పద్నాలుగు కణితులు మాత్రం 5 నుంచి 8 సెంటిమీటర్ల పొడవు ఉన్నాయి. ప్రస్తుతం బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
బాధితురాలి సోదరి కూడా..
ఇలాంటి అనారోగ్య సమస్య కారణంగానే బాధితురాలి సోదరి కూడా తీవ్రంగా బాధపడింది. అదే ఆస్పత్రిలో 2015లో ఆమెకు కూడా సర్జరీ నిర్వహించారు. ఆమె గర్భాశయంలో నుంచి 48 కణితులను తొలగించారు. కానీ ఆమె బతకలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi Doctors
- fibroids
- Uterus
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

