సూరత్ : కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి బర్త్ డే వేడుకలు జరిపి.. ఆమెలో ఉత్సాహాన్ని నింపారు వైద్యులు. కరోనాకు గురైన ఓ మహిళ సూరత్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఏప్రిల్ 22 ఆమె పుట్టిన రోజు కావడంతో.. డాక్టర్లు బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. తుమ్ జియో హాజారో సాల్ పాట పాడి ఆ రోగిలో ఉత్సాహాన్ని నింపారు. దీంతో ఆమె కూడా చప్పట్లు కొడుతూ.. సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరోనాతో బాధపడుతున్న రోగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వైద్యులు అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ వీడియోను ముంబై ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Covid warriors like these doctors not only giving their services but also going the extra mile to cheer the patients like celebrating their birthday. Scene from Surat Civil Hospital. #covidwarriors pic.twitter.com/V65zmYKlET
— Viral Bhayani (@viralbhayani77) April 22, 2021