Doctor Murder | డ్రెస్సింగ్ కోసం వచ్చి.. డాక్టర్‌ను కాల్చి చంపారు
హాస్పిటళ్లలో తమ భద్రతకు భరోసా నివ్వాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ.. మరో డాక్టర్ హత్యకు గురయ్యాడు. వైద్యం కోసం ఇద్దరు యువకులు డాక్టర్‌ను (Doctor Murder) తుపాకీతో కాల్చి చంపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని జైత్పూర్లో గత రాత్రి జరిగింది.
న్యూఢిల్లీ: హాస్పిటళ్లలో తమ భద్రతకు భరోసా నివ్వాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ.. మరో డాక్టర్ హత్యకు గురయ్యాడు. వైద్యం కోసం ఇద్దరు యువకులు డాక్టర్‌ను (Doctor Murder) తుపాకీతో కాల్చి చంపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని జైత్పూర్లో గత రాత్రి జరిగింది. బుధవారం రాత్రి కాలి గాయానికి డ్రెస్సింగ్ కోసం ఇద్దరు టీనేజర్లు జైత్‌పూర్‌లోని నిమా హాస్పిటల్‌కు వచ్చారు. వారు అంతకు ముందు రోజు కూడా చికిత్స చేయించుకుని వెళ్లారు. అదేవిధంగా బుధవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత కూడా దవాఖానకు వచ్చారు. నర్సింగ్ స్టాఫ్ వారికి డ్రెస్సింగ్ పూర్తిచేశారు. అనంతరం తాము ప్రిస్క్రిప్షన్ రాయించుకుంటామంటూ డాక్టర్ క్యాబిన్‌కు వెళ్లారు.
కొద్ది సేపట్లోనే కాల్పుల శబ్దం వినిపించడంతో నర్సింగ్ సిబ్బంది గజాలా పర్వీణ్, ఎండీ కమిల్ క్యాబిన్‌కు వెళ్లిచూశారు. అప్పటికే తీవ్రంగా గాయపడి చనిపోవడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితులు 16, 17 ఏండ్ల వయస్సులోపు ఉంటారని పోలీసులకు తెలిపారు. అయితే రెక్కీ నిర్వహించేందుకే ముందు రోజు వారు దవాఖాను వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను గర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
#WATCH | Delhi | A doctor named Javed Akhtar was shot dead inside Nima Hospital, Jaitpur under the Kalindi Kunj PS area. As per hospital staff, two boys had come to the hospital with an injury, after dressing they had demanded to meet the doctor and shot him dead once they… pic.twitter.com/OJTkTsl5MJ
— ANI (@ANI) October 3, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Doctor Murder
- dressing
- murder
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

