Crime news | భార్య, ఇద్దరు పిల్లలను చంపి వైద్యుడి ఆత్మహత్య.. పెళ్లాం వేధింపులు భరించలేకేనంటూ సూసైడ్ నోట్
Crime news | మహారాష్ట్రలోని పుణె నగర శివార్లలో ఘోరం జరిగింది. భార్య పెట్టే హింస భరించలేక ఓ వైద్యుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
పుణె: మహారాష్ట్రలోని పుణె నగర శివార్లలో ఘోరం జరిగింది. భార్య పెట్టే హింస భరించలేక ఓ వైద్యుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పుణె జిల్లాలోని డాండ్ మండలం వార్వాండ్ గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. వార్వాండ్ గ్రామానికి చెందిన పశువుల డాక్టర్ అతుల్ దివేకర్ (42) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. గత కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం కూడా గొడవ జరగడంతో అతుల్ దివేకర్ తన భార్యను ఉరితీసి చంపేశాడు. ఆ తర్వాత కొడుకు అద్వైత్, కుమార్తె వేదాంతిని బయటికి తీసుకెళ్లి ఓ బావిలో పడేశాడు.
అనంతరం ఇంటికి తిరిగొచ్చి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. మృతుడి జేబులో సూసైడ్ నోట్ లభ్యమైందని పోలీసులు చెప్పారు. తన భార్య తనను నిత్యం వేధిస్తున్నదని, ఆ వేధింపులు తాళలేకనే తాను ఇంతటి తీవ్రమైన చర్యకు పాల్పడాల్సి వచ్చిందని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Crime news
- maharastra
- murders
- Pune
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

