Pegasus | దాచిపెట్టిందేమీ లేదు.. అఫిడవిట్ దాఖలు చేయాలనుకోవడం లేదు: ప్రభుత్వం
పెగాసస్ ( Pegasus ) వివాదంలో దాఖలైన పిటిషన్లపై తాము ఎలాంటి సవివర అఫిడవిట్ దాఖలు చేయాలని అనుకోవడం లేదని సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.

న్యూఢిల్లీ: పెగాసస్ ( Pegasus ) వివాదంలో దాఖలైన పిటిషన్లపై తాము ఎలాంటి సవివర అఫిడవిట్ దాఖలు చేయాలని అనుకోవడం లేదని సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. మేము దాచి పెట్టింది ఏమీ లేదు. అందుకే ప్రభుత్వమే తనకు తానుగా ఈ ఆరోపణలపై విచారణ జరపడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనానికి కేంద్రం స్పష్టం చేసింది.
ఏదైనా సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం వాడిందా లేదా అన్నది పబ్లిక్‌గా చర్చించే అంశం కాదు. ఈ అంశాన్ని అఫిడవిట్లో భాగం చేయడం జాతి ప్రయోజనాలకు మంచిది కాదు అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి చెప్పారు. నిపుణుల కమిటీ నివేదికను తాము కోర్టు ముందు ఉంచుతామని మాత్రం హామీ ఇచ్చారు.
అయితే జాతీయ భద్రతకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని తాము అడగడం లేదన్న విషయాన్ని కోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ కొనసాగనుంది. పెగాసస్ వివాదంపై అఫిడవిట్ దాఖలు కోసం ఈ నెల 7న కేంద్రానికి కోర్టు మరింత సమయం ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

