ముంబై : బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే స్టార్స్‌లో స్టన్నింగ్ బ్యూటీ దిశా పటానీ (Viral Video) పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. జిమ్‌లో ఆమె కఠిన వ్యాయామాలు చేసే పోస్ట్‌లు ఎందరిలోనో స్ఫూర్తిని రగిలిస్తాయి.
తీరైన దేహాకృతితో ఆకట్టుకునే దిశా పటానీ స్ట్రాంగ్ ఫిజిక్ వెనుక ఆమె కష్టం దాగుంది. వర్కవుట్‌ను విడిచిపెట్టకుండా చేయడం, డైట్ ప్లాన్‌తో దిశా పటానీ తన పర్ఫెక్ట్ షేప్‌ను మెయింటెన్ చేస్తోంది.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో చెమటోడుస్తున్న వీడియోను దిశా పటానీ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ క్లిప్ నెట్టింట తెగ వైరలవుతోంది. దిశా పటానీ కఠిన వ్యాయామాలు చేస్తూ, బరువులు ఎత్తుతున్న వీడియో ఫిట్నెస్ ప్రియులతో పాటు ఆమె ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Read More :