Loksabha Elections 2024 | బీజేపీ 300 సీట్లు దాటితే అది ఈవీఎంల మహత్యమే.. : దిగ్విజయ్ సింగ్
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి 295 స్ధానాల్లో గెలుపొంది తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి 295 స్ధానాల్లో గెలుపొంది తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. పాలక పక్షానికి 300కుపైగా సీట్లు వస్తే అవి ప్రజల ఓట్లతో కాదని, ఈవీఎంల ఊతంతో అని బీజేపీ పేరు ప్రస్తావించకుండా ఆరోపించారు.
నిజంగా ప్రజలు ఓటు వేస్తే వారికి మెజారిటీ స్ధానాలు లభించవని, కాంగ్రెస్కు మాత్రం 295 స్ధానాలు (ఇండియా కూటమికి) వస్తాయని అన్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ రాష్ట్రంలోని రాజ్ఘఢ్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నలిచారు.
లోక్సభ ఎన్నికల్లో 543 స్ధానాలకు గాను తమకు 295 స్ధానాల వరకూ లభిస్తాయని పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు విపక్ష ఇండియా కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కాదని అవి కాషాయ కూటమి మేనేజ్ చేసిన పోల్స్ అంటూ విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రేపటి కౌంటింగ్లో విపక్ష కూటమి అత్యధిక స్ధానాలు దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ సహా విపక్ష నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read More :
Sonia Gandhi | జూన్ 4న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారే : సోనియా గాంధీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

