హిందువులు, ముస్లింల సంతానోత్పత్తి రేటుపై దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు!

భోపాల్ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2028 నాటికి హిందువులు, ముస్లింల్లో సంతాన సాఫల్య రేటు ఒకే విధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఓ అధ్యయన వివరాల ప్రకారం 1951 నుంచి ముస్లింల్లో సంతానోత్పత్తి రేటు హిందువులతో పోలిస్తే అధికంగా తగ్గుతోందని, ప్రస్తుతం ముస్లింల్లో సంతాన సాఫల్య రేటు 2.7 శాతం కాగా, హిందువుల్లో ఇది 2.3 శాతంగా ఉందని..2028 నాటికి ఇది హిందూ, ముస్లింలలో సమానంగా ఉంటుందని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
ముస్లింల జనాభా పెరుగుతోందని త్వరలో వారి జనాభా హిందువులను అధిగమిస్తుందని కొందరు పేర్కొంటున్న నేపధ్యంలో దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దిగ్విజయ్ సెప్టెంబర్ మొదటి వారంలోనూ ఈ అంశంపై మాట్లాడారు. ముస్లింల జనాభా పెరుగుదల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటూ ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని మోహన్ భగవత్ సహా ఆరెస్సెస్ ప్రచారక్‌లకు ఆయన సవాల్ విసిరారు. ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నదని, హిందువుల కంటే ముస్లింలు ఈ దేశంలో ఎన్నడూ మెజారిటీలు కాబోరని తాను నిరూపిస్తానని అన్నారు. ధరల మంటతో సామాన్యుడు భార్యా, పిల్లలతో బతకలేని పరిస్ధితులు ఉండగా, ఓ ముస్లిం నలుగురు భార్యలు, వారికి పుట్టిన పిల్లలతో ఎలా నెట్టుకొస్తారని ఆయన ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

