కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కేరళ సీఎం !

తిరువనంతపురం : కేరళ సీఎం పినరయి విజయన్.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు విమర్శలు వస్తున్నాయి. కోవిడ్ రిపోర్ట్ నెగటివ్ రావడంతో.. బుధవారం రోజున ఆయన కోజికోడ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత.. అంటే ఏప్రిల్ 8వ తేదీన సీఎం విజయన్ కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. అయితే రూల్ ప్రకారం .. పాజిటివ్ వచ్చిన వారికి మళ్లీ పది రోజుల తర్వాత పరీక్ష చేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయాలి. కానీ బుధవారం రోజున ఆయనతో పాటు ఆయన భార్య కూడా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. కోజికోడ్ కాలేజీ డాక్టర్ చెప్పిన విషయాలు వివాదానికి దారి తీశాయి.
సీఎం విజయన్ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించలేదని, ఎందుకంటే ఆయనకు ఏప్రిల్ 4వ తేదీన పాజిటివ్‌గా వచ్చినట్లు ఆ డాక్టర్ తెలిపారు. వాస్తవానికి ఆ రోజున ప్రచారానికి చివరి రోజు కావడంతో సీఎం విజయన్ .. ధర్మదం నియోజకవర్గంలో ర్యాలీలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఏప్రిల్ ఆరవ తేదీన పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేశారు. మీడియాతోనూ మాట్లాడారు. విమర్శలు వస్తున్న నేపథ్యంలో చివరగా కాలేజీ డాక్టర్ మరో వివరణ ఇచ్చారు. ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి విజయన్‌లో కోవిడ్ లక్షణాలు కనిపించాయని, ఏప్రిల్ 8న నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌గా తేలారని, అంటే బుధవారానికి 10 రోజుల గడువు ముగిసిందని డాక్టర్ తెలిపారు. పరీక్షలో నెగటివ్ రావడంతోనే సీఎంను ఇంటికి పంపినట్లు చెప్పారు. సీఎం విజయన్ వారం రోజుల పాటు హోం క్వారెంటైన్లో ఉండనున్నారు. మే 2వ తేదీన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

