Dengue Cases: ఢిల్లీలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు.. ఈ లక్షణాలుంటే జాగ్రత్తపడాల్సిందే
Dengue Cases: ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు ఢిల్లీలో 240 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. గత వారంలో కొత్తగా 56 కేసులు నమోదు అయినట్లు మున్సిపల్ కార్పొరేషన్ రిపోర్టులో తేలింది. భారీగా వచ్చిన వరదల్లో ఢిల్లీ మునిగిపోవడం వల్ల డెంగ్యూతో పాటు దోమల వల్ల సోకే ఇతర వ్యాధులు కూడా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఢిల్లీలో డెంగ్యూ కేసులు(Dengue Cases) పెరుగుతున్నాయి. ఇటీవల నగరంలో భారీ వర్షాలు కురవడం.. యమునా నది ఉప్పొంగిపోవడంతో.. అక్కడ దోమలు పెరిగిపోయాయి. దీంతో ఆ వైరల్ జ్వరం కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి లక్షణాల్లో జ్వరం, కళ్ల మంట, తలనొప్పి, కడుపునొప్పి, వాంతులు, కొన్ని సార్లు విరోచనాలు కూడా అవుతాయి. ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు ఢిల్లీలో 240 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. గత వారంలో కొత్తగా 56 కేసులు నమోదు అయినట్లు మున్సిపల్ కార్పొరేషన్ రిపోర్టులో తేలింది. భారీగా వచ్చిన వరదల్లో ఢిల్లీ మునిగిపోవడం వల్ల డెంగ్యూతో పాటు దోమల వల్ల సోకే ఇతర వ్యాధులు కూడా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది.
డెంగ్యూ ఎలా వస్తుంది..
నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌లను దోమలు క్యారీ చేస్తుంటాయి. అలాంటి దోమలు కుట్టినప్పుడు మనకు డెంగ్యూ జ్వరం వస్తుంది. ఆ వైరస్ వల్ల మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ వైరస్ నేరుగా రక్తంపై ప్రభావం చూపుతుంది. శరీరంలో అంతర్గతంగా బ్లీడింగ్ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. దీని వల్ల తీవ్రమైన లక్షణాలు డెవలప్ అవుతాయి. మనిషి నుంచి మనిషికి డెంగ్యూ వ్యాధి సోకదు.
డెంగ్యూ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం ఉంటుంది. తలనొప్పి, వొళ్లు, నొప్పులు, కీళ్ల నొప్పులు కూడా తీవ్రంగా ఉంటాయి. కొందరికి ఉదరసంబంధిత సమస్యలు వస్తాయి. జలుబు, దగ్గుతో పాటు అలసిపోవడం కూడా జరుగుతుంది. దోమల పునరుత్పత్తిని ఆపడం వల్ల డెంగ్యూ వ్యాప్తిని అడ్డుకునే ఛాన్సు ఉంది. నీరు ఎక్కువగా నిలిచిపోకుండా చూసుకోవాలి. పువ్వుల కుండీలు, కూలర్ల లాంటి వాటిల్లో నీటిని నిల్వ ఉంచకూడదు. వేడి చేసిన లేదా శుద్ధి చేసిన నీటిని తాగాలి. దోమ తెరలను కానీ, రెపల్లెంట్స్ను కానీ వాడండి. ఎప్పుడూ తాజా ఆహారాన్ని సేవించాలి. వీధి వ్యాపారుల ఆహారాన్ని ఆపేయాలి. పండ్లు, కూరగాయల్నిశుభ్రంగా కడగాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

