దేశంలో అసంఘటిత రంగంపై పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కొవిడ్ దెబ్బ.. రూ.11.3 లక్షల కోట్ల నష్టం
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న అసంఘటిత రంగం 2016 నుంచి దారుణంగా దెబ్బతిన్నదని ఇండియా రేటింగ్ అండ్ రిసెర్చ్ సంస్థ చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న అసంఘటిత రంగం 2016 నుంచి దారుణంగా దెబ్బతిన్నదని ఇండియా రేటింగ్ అండ్ రిసెర్చ్ సంస్థ చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఈ రంగంలో పతనం మొదలయ్యిందని, జీఎస్టీ అమలుతో ఇది మరింత తీవ్రమైందని పేర్కొన్నది. కొవిడ్ మహమ్మారి ఈ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసిందని తెలిపింది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.11.3 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నది. అసంఘటిత రంగంలో 63 లక్షల సంస్థలు మూతబడ్డాయని, ఫలితంగా 1.6 కోట్ల మంది ఉద్యోగాలు పోయాయని వెల్లడించింది.
పెద్ద నోట్ల రద్దుతో మొదలు
పన్నుల పరిధిలో ఉండని వీధి వ్యాపారాలు వంటి వాటిని అసంఘటిత రంగంగా చూస్తారు. దేశ గ్రాస్ వాల్యూ యాడెడ్(జీవీఏ)లో దీని వాటా దాదాపు 44 శాతంగా ఉంటుంది. అయితే, 2016లో పెద్ద నోట్ల రద్దు నుంచి ఈ రంగంలో ఒడిదొడుకులు మొదలయ్యాయి. జీఎస్టీ అమలు చేయడం, కొవిడ్ ప్రభావంతో ఈ రంగం వరుస దెబ్బలు తిన్నది. ఫలితంగా 2015-16 నుంచి 2022-23 వరకు దాదాపు 63 లక్షల చిరు వ్యాపారాలు మూతబడి 1.6 కోట్ల ఉద్యోగాలు పోయాయని నివేదిక తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

