Dell Layoffs | సేల్స్ టీం ఉద్యోగులపై డెల్ టెక్నాలజీస్ వేటు
సేల్స్ టీమ్స్‌కు చెందిన ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు డెల్ (Dell Layoffs) వెల్లడించింది. భాగస్వాములతో కలిసి మార్కెట్లోకి వెళ్లే వ్యూహాలకు పదును పెడుతున్న క్రమంలో సేల్స్ టీం ఉద్యోగులపై వేటు వేసేందుకు సంసిద్ధమైంది.
న్యూయార్క్ : సేల్స్ టీమ్స్‌కు చెందిన ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు డెల్ (Dell Layoffs) వెల్లడించింది. భాగస్వాములతో కలిసి మార్కెట్లోకి వెళ్లే వ్యూహాలకు పదును పెడుతున్న క్రమంలో సేల్స్ టీం ఉద్యోగులపై వేటు వేసేందుకు సంసిద్ధమైంది. లేఆఫ్స్‌ను డెల్ ప్రతినిధి నిర్ధారిస్తూ బాధిత ఉద్యోగులకు సాయం అందించేందుకు కంపెనీ కసరత్తు సాగిస్తోందని తెలిపారు.
సేల్స్ టీంలోని కొందరు సభ్యులు కంపెనీని వీడతారని, ఇది కఠిన నిర్ణయమే అయినా వారు తమ తదుపరి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తాము మద్దతు అందిస్తామని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 6650 మంది ఉద్యోగులను తొలగిస్తామని కంపెనీ చేసిన ప్రకటనలో ఈ ఉద్యోగులు ఉన్నారా లేక వీరు అదనమా అనేది తెలియరాలేదు. సేల్స్ టీముల్లో ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
డెల్ మార్కెటింగ్ వ్యూహాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని డెల్ సేల్స్, కస్టమర్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ బిల్ స్కానెల్ చెప్పుకొచ్చారు. నూతన విధానం ద్వారా డెల్ కస్టమర్లకు ఇప్పుడు భాగస్వామ్య చానెల్స్ ద్వారా అత్యంత ప్రాధాన్యత లభిస్తుందని డెల్ టెక్నాలజీస్, యూకే చానెల్ వైస్ ప్రెసిడెంట్ రాబ్ టమ్లిన్ పేర్కొన్నారు. డెల్ సేల్స్ మోడల్లో చేపట్టే మార్పుల ద్వారా కస్టమర్ల డిమాండ్లు, మార్కెట్ వాతావరణానికి అనుగుణంగా సేల్స్ విధానాలను మెరుగుపరుస్తామని చెప్పారు.
Read More :
IT Jobs | ఐటీ పరిశ్రమలో మందగమనం, అనిశ్చితి.. 60 శాతం పడిపోనున్న నియామకాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

