Sonia Gandhi | సీరియల్ కిల్లర్ శోభరాజ్ గర్ల్‌ఫ్రెండ్‌కు ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లా : సోనియాగాంధీ
Sonia Gandhi | పేరుమోసిన హంతకుడు, సీరియల్ కిల్లర్ (Serial Killer) చార్లెస్ శోభరాజ్ (Charles Shobharaj) గర్లఫ్రెండ్‌కు తాను ఇంటి భోజనం తీసుకెళ్లానని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) వెల్లడించారు. ఎమర్జెన్సీ (Emergency) అనంతరం ఏర్పాటైన జనతా ప్రభుత్వం 1978లో తన అత్త ఇందిరాగాంధీ (Indira Gandhi) ని జైలుకు పంపిందని, ఆమెను తీహార్ జైల్లో ఉంచారని సోనియా గుర్తుచేశారు.
Sonia Gandhi : పేరుమోసిన హంతకుడు, సీరియల్ కిల్లర్ (Serial Killer) చార్లెస్ శోభరాజ్ (Charles Shobharaj) గర్లఫ్రెండ్‌కు తాను ఇంటి భోజనం తీసుకెళ్లానని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) వెల్లడించారు. ఎమర్జెన్సీ (Emergency) అనంతరం ఏర్పాటైన జనతా ప్రభుత్వం 1978లో తన అత్త ఇందిరాగాంధీ (Indira Gandhi) ని జైలుకు పంపిందని, ఆమెను తీహార్ జైల్లో ఉంచారని సోనియా గుర్తుచేశారు.
ఆ సమయంలో తాను తన అత్త కోసం ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లేదాన్నని, అలా ఓ సందర్భంలో అదే జైల్లో ఉన్న చార్లెస్ శోభరాజ్ గర్ల్‌ఫ్రెండ్‌కు కూడా భోజనం పంపించానని తన ఆత్మకథ ‘బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్’ లో పేర్కొన్నారు. తీహార్ జైల్లో ఉన్నప్పుడు అత్తమ్మ (ఇందిరా గాంధీ) తనతోపాటు మరికొంతమందికి కూడా భోజనం తీసుకురమ్మని చెప్పేవారని, అలా ముగ్గురు మహిళా గార్డులు, జైల్లో ఖైదీగా ఉన్న ఓ విదేశీ యువతికి తాను ఓసారి భోజనం తీసుకెళ్లానని తెలిపారు.
ఆ విదేశీ యువతి ఎవరో కాదని, భారత్ సహా థాయ్‌లాండ్, నేపాల్‌లో ఎంతోమందిని హత్య చేసిన కేసులో దోషిగా ఉన్న ఛార్లెస్ శోభరాజ్ గర్ల్‌ఫ్రెండ్ అని వెల్లడించారు. ఆమె శోభరాజ్ గర్ల్‌ఫ్రెండ్ అనే విషయం తనకు తర్వాత తెలిసిందని సోనియా తన పుస్తకంలో రాసుకొచ్చారు. కాగా, భారత్-వియత్నాం సంతతికి చెందిన ఛార్జెస్ శోభరాజ్ 1970 ల్లో ఆసియాలోని అనేక దేశాల్లో పలు హత్యలకు పాల్పడ్డాడు.
1976 జూలైలో అతడితోపాటు ముగ్గురు మహిళలను భారత పోలీసులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. అందులో శోభరాజ్ గర్ల్‌ఫ్రెండ్ మేరీ ఆండ్రీ లెక్లెర్క్ ఒకరు. తర్వాత ఆమె క్యాన్సర్ బారిన పడటంతో 1983లో కెనడాకు తిరిగి వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఆ మరుసటి ఏడాది ఆమె మరణించింది. 1986లో శోభరాజ్ తీహార్ జైలు నుంచి తప్పించుకోగా మళ్లీ అరెస్టు చేసి 1997లో బెయిల్‌పై విడుదల చేశారు.
2004లో ఓ హత్య కేసుకు సంబంధించి నేపాలీ కోర్టు అతడిని దోషిగా తేల్చి శిక్ష విధించింది. 2022లో జైలు నుంచి విడుదలైన అతడు ఫ్రాన్స్‌కు వెళ్లిపోయాడు. కాగా, ఎమర్జెన్సీ తర్వాత 1978లో ఏర్పడిన జనతా ప్రభుత్వం ఇందిరా గాంధీని జైలుకు పంపింది. కొన్ని రోజులు తీహార్ జైల్లో ఉన్న ఆమె అదే ఏడాది డిసెంబర్ 26న విడుదలయ్యారు. ఆ తర్వాత 1980లో ఇందిర మళ్లీ అధికారంలోకి వచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Group-2 | 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్.. డిసెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి
Sonia Gandhi | సీరియల్ కిల్లర్ శోభరాజ్ గర్ల్‌ఫ్రెండ్‌కు ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లా : సోనియాగాంధీ
RS Praveenkumar | ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొట్టాలని చూస్తున్న గ్రీన్ SM కంపెనీ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ACB raids | ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై ఇంటిపై ఏసీబీ దాడులు
UP Assembly Polls: 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. కలిసి పోటీ చేయనున్న ఓవైసీ-ఆజాద్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

