Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Road Accident | జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవదర్శనానికి బయల్దేరిన భక్తుల స్కార్పియో ఎస్యూవీ వేగంగా దూసుకెళ్లి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు.
Road Accident | జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవదర్శనానికి బయల్దేరిన భక్తుల స్కార్పియో ఎస్యూవీ వేగంగా దూసుకెళ్లి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు.
బిహార్‌లోని నలంద జిల్లా జంఘారో గ్రామానికి చెందిన 14 మంది స్కార్పియో వాహనంలో జార్ఖండ్‌లోని రజరప్ప ఆలయానికి దర్శనం కోసం బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో రాంచీ–పట్నా జాతీయ రహదారి (ఎన్‌హెచ్-33)పై రామ్‌గఢ్ జిల్లా కూజు ప్రాంతంలోని పైంకి గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన స్కార్పియో ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది.
ప్రమా జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించేందుకు సహకరించారు. పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని రామ్‌గఢ్ సదర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో 13 మంది మరణించారని.. తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తికి చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు.
ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం కారణంగానే వాహనం అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టిందా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
IND vs NZ | బుమ్రా దెబ్బకు లాథమ్ ఔట్.. టీ బ్రేక్‌కు కివీస్ స్కోర్ ఇదే
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

