Home
National
Delhipolice Arrested 53 Foreign Nationals For Allegedly Attacking Police Station In Delhi
ఢిల్లీలో పోలీస్ స్టేషన్‌పై దాడి.. 53 మంది విదేశీయులు అరెస్టు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో 53 మంది విదేశీయులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారంతా నైజీరియా దేశస్థులై ఉంటారని భావిస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌పై నైజీరియన్లు కర్రెలు, రాళ్లతో దాడి చేశారు. విదేశీయులు దాడి చేసిన ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. అయితే ఆ సమయంలో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లిన విదేశీయులు.. తీవ్ర విధ్వసం సృష్టించారు. ఇటీవల తమ గ్రూపునకు చెందిన ఓ వ్యక్తి మరణించిన నేపథ్యంలో.. నైజీరియన్లు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఆ వ్యక్తికి వైద్య పరీక్షలు చేయాలని పోలీసులు భావించారు. దీన్ని నైజీరియన్లు వ్యతిరేకించారు. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

