వ్యాపారాలు దెబ్బతింటున్నాయి..
ర్యాలీని వాయిదా వేసుకోండి రాహుల్‌కి వ్యాపార వర్గాల వినతి.
న్యూఢిల్లీ: రామ్‌లీలా మైదానం వద్ద నవంబర్ 1న కాంగ్రెస్ నిర్వహించే ర్యాలీని వాయిదా వేసుకోవాలని ఢిల్లీ వ్యాపారులు లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీ కారణంగా పండుగ సీజన్లో రామ్‌లీలా మైదానం సమీపంలోని రిటైల్, హోల్‌సేల్ వ్యాపారుల అమ్మకాలు తీవ్రంగా దెబ్బతింటాయని, రూ.10 వేల కోట్లకు పైగా నష్టం వస్తుందని చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) పేర్కొంది.
రామ్‌లీలా చుట్టుపక్కల 20కి పైగా హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లు ఉన్నాయి. నవంబర్ 1న నిర్వహించే ఆందోళన వల్ల విధించే ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు, మెట్రోస్టేషన్ల మూసివేత, బారికేడ్ల వల్ల వినియోగదారులు మార్కెట్లకు రారని, దీని కారణంగా తమ వ్యాపారం బాగా తగ్గి వేలాది కోట్ల రూపాయల వ్యాపారానికి నష్టం ఏర్పడుతుందని సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ తెలిపారు. నవంబర్ 10 వరకు ర్యాలీని వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

