విద్యార్థులు రోజులో ఎక్కువ సమయం గడిపేది స్కూళ్లోనే. టీచర్లు రోజూ పాఠాలు.. పాఠాలు అంటుంటూ బోర్‌గా ఫీలవుతుంటారు. వారికి జీవితం యాంత్రికంగా అనిపిస్తుంది. మరి స్కూల్లో తమకు నచ్చిన టీచర్ ఉంటే.. తమకు పాఠాలు చెప్పడంతోపాటు కలిసి స్టెప్పులేస్తే.. వాళ్లు వద్దన్నా స్కూల్‌కు వెళ్తారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు డ్యాన్స్ నేర్పిస్తూ..వాళ్లతో కలిసి సరదాగా నృత్యం చేస్తున్న ఢిల్లీ టీచర్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ హృదయపూర్వకమైన వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది.
ఈ వీడియో క్లిప్‌ను ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల టీచర్ మను గులాటీ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ వీడియోలో మను గులాటీ తన విద్యార్థులతో కలిసి బాలీవుడ్ సినిమా ‘కిస్మత్’లోని ఎవర్గ్రీన్ సాంగ్ ‘కజ్రా మొహబ్బత్ వాలా’ పై ఎంతో పర్ఫెక్ట్ స్టెప్పులేసి వావ్ అనిపించారు. ముందు విద్యార్థులు వరుసలో నిల్చుని ఒక్కొక్కరు వచ్చి స్టెప్పులేసి వెళ్తారు. చివర్లో టీచర్ వచ్చి అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. అనంతరం విద్యార్థులు టీచర్‌తో చేరి పాటకు అనుగుణంగా స్టెప్పులేశారు. ఇది తమ సమ్మర్ క్యాంపు చివరి రోజు చేసిన అసంపూర్ణ నృత్యమని, ఆనందం, కలయిక తోడైతే అందమైన స్టెప్పులు పుడతాయని గులాటీ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 5.5లక్షల వ్యూస్ వచ్చాయి. ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ‘సమాజానికి మీలాంటి ఉపాధ్యాయులు కావాలి.. విద్యార్థులు చదువుతో పాటు పాఠ్యేతర కార్యకలాపాలను కూడా ఆస్వాదిస్తున్నారు… మీకు గ్రాండ్ సెల్యూట్.’ అంటూ కామెంట్ చేశారు.
दिल्ली शहर का सारा मीना बाज़ार ले के।☺️
Our imperfect dance moves on the last day of summer camp…leading to some perfect moments of joy and togetherness.💕#SchoolLife #TeacherStudent pic.twitter.com/K50Zi1Qajf
— Manu Gulati (@ManuGulati11) June 16, 2022