ఢిల్లీలో 9వ మంకీపాక్స్ కేసు… దేశంలో 14కు చేరిన సంఖ్య
దేశంలో మంకీపాక్స్ వైరస్ కేసుల సంఖ్య 14కు పెరిగింది. ఇందులో 9 కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. మరో ఐదు కేసులు కేరళలో వెలుగు చూశాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ 9వ కేసు నమోదైంది. 30 ఏళ్ల నైజీరియా మహిళకు ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో ఆమెను అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలో నైజీరియాకు చెందిన మరో వ్యక్తి కూడా మంకీపాక్స్ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అతడి టెస్ట్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 16న కూడా ఢిల్లీలో 30 ఏళ్ల నైజీరియా మహిళకు మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ ఏడాది జూలై 24న దేశ రాజధానిలో తొలి మంకీపాక్స్ కేసు వెలుగుచూసింది.
మరోవైపు దేశంలో మంకీపాక్స్ వైరస్ కేసుల సంఖ్య 14కు పెరిగింది. ఇందులో 9 కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. మరో ఐదు కేసులు కేరళలో వెలుగు చూశాయి. ఆఫ్రికా, ఐరోపా దేశాలను మంకీపాక్స్ వణికించింది. దేశంలో తొలి కేసు ఈ ఏడాది జూలై 14న కేరళలోని కొల్లాం జిల్లాలో నమోదైంది. ఆ రోగి కోలుకోవడంతో గత వారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కేరళలో నమోదైన ఐదుగురు మంకీపాక్స్ రోగులు యూఏఈలో పర్యటించినట్లు వారి ట్రావెల్ హిస్టరీ ద్వారా తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Monkeypox
- Nigerian woman
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

