ఢిల్లీలో మంకీపాక్స్ 8వ కేసు… నైజీరియా మహిళకు పాజిటివ్
దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 13కు పెరిగింది. ఇందులో 8 కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ 8వ కేసు నమోదైంది. 30 ఏళ్ల నైజీరియా మహిళకు మంకీపాక్స్ పాజిటివ్‌గా శుక్రవారం నిర్ధారణ అయ్యింది. లోక్ నాయక్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నది. కాగా, మంకీపాక్స్ సోకిన మరో నైజీరియా మహిళ కూడా ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ వ్యాధి లక్షణాలున్న మరో వ్యక్తి కూడా ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. దీంతో ఢిల్లీలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 8కి చేరిందని అధికారులు వెల్లడించారు.
మరోవైపు దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 13కు పెరిగింది. ఇందులో 8 కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. మరో ఐదు కేసులు కేరళలో వెలుగు చూశాయి. ఆఫ్రికా, ఐరోపా దేశాలను మంకీపాక్స్ వణికించింది. దేశంలో తొలి కేసు ఈ ఏడాది జూలై 14న కేరళలోని కొల్లాం జిల్లాలో నమోదైంది. ఆ రోగి కోలుకోవడంతో గత వారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కేరళలో నమోదైన ఐదుగురు మంకీపాక్స్ రోగులు యూఏఈలో పర్యటించినట్లు వారి ట్రావెల్ హిస్టరీ ద్వారా తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Monkeypox
- Nigerian woman
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

