Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Abhijeet Dipke : ఢిల్లీలోని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే నివాసానికి పోలీసులు చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం జరగాల్సిన లెహ్రా దో తిరంగా ర్యాలీకి వెళ్లకూడదని సూచిస్తూ, దీప్కేకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Abhijeet Dipke : ఢిల్లీలోని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే నివాసానికి పోలీసులు చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం జరగాల్సిన లెహ్రా దో తిరంగా ర్యాలీకి వెళ్లకూడదని సూచిస్తూ, దీప్కేకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను జాతీయ జెండా చేతబట్టుకున్నందుకు అరెస్టు చేశారని సీజేపీ ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వద్ద ఉన్న సెంట్రల్ పార్క్ నుంచి లెహ్రా దో తిరంగా పేరుతో ర్యాలీ నిర్వహించాలని దీప్కే పిలుపునిచ్చారు. ఇందుకోసం దీప్కే ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ, జండేవాలన్లో ఉన్న దీప్కే నివాసానికి శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు చేరుకున్నారు. సాయంత్రం జరిగే ర్యాలీకి వెళ్లకూడదని సూచిస్తూ పోలీసులు దీప్కేకు నోటీసులు జారీ చేశారు. ర్యాలీకి వెళ్తే అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అనంతరం పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే, ఆయన ఇంటి సమీపంలో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. అంతకుముందు గురువారం సాయంత్రం దీప్కే మీడియాతో మాట్లాడారు. పోలీసులు తనను అడ్డుకోవచ్చని, తాను ర్యాలీక వెళ్లకుండా చూస్తున్నారని ఆరోపించారు. జెండా ఊపినందుకు అవసరమైతే అరెస్టు అయ్యేందుకు కూడా తాను సిద్ధమేనని చెప్పారు. మరోవైపు తిరంగా ర్యాలీ నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్న సెంట్రల్ పార్కును పోలీసులు ముందు జాగ్రత్తగా మూసివేశారు.
ఈ ప్రదేశంలో నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారు. వేలాదిమంది పోలీసులు ఇప్పటికే ఈ ప్రాంతంతోపాటు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో భారీగా మోహరించారు. మరోవైపు సీజేపీ ఆందోళన నేపథ్యంలో స్థానిక వ్యాపారులు తమ వ్యాపార సంస్థల్ని మూసేశారు. తమ వ్యాపారాలు దెబ్బతినడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

