Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Delhi Police : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టనుంది. నవంబర్ 1న ర్యాలీ నిర్వహించనుంది. ఇందుకోసం ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుమతిపత్రం మంజూరు చేశారు.
Delhi Police : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టనుంది. నవంబర్ 1న ర్యాలీ నిర్వహించనుంది. ఇందుకోసం ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుమతిపత్రం మంజూరు చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్కు, సర్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా బ్లాక్ కూటమి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో కూడా ఆందోళనల సరళిపై నిర్ణయం తీసుకున్నారు.
దీనిలో భాగంగా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికను ఆందోళనల చేసే ప్రదేశాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో రాంలీలా మైదానంలో ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకోసం అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసులను కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించింది. వారి వినతిని పరిశీలించిన పోలీసులు.. నవంబర్ 1న ర్యాలీ నిర్వహించుకునేందుకు అనుమతించారు. శనివారం నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చారు.
అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఏ రోజైనా ర్యాలీ నిర్వహించుకోవచ్చని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. దీంతో నవంబర్ 1న ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ ర్యాలీ కోసం ఢిల్లీ పోలీసులు నిర్వాహకులతోపాటు ట్రాఫిక్ పోలీసులు, ఇతర వ్యవస్తలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ మళ్లించాల్సి ఉంటుంది. శాంతి భద్రతలను కాపాడాలి. ఈ నేపథ్యంలో అన్నీ పరిశీలించిన పోలీసులు.. నిబంధనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి అనుమతించారు.
సేవ్ డెమొక్రసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టే అవకాశం ఉంది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే పాల్గొంటారా.. లేక ఇండియా బ్లాక్ కూటమి నేతలంతా పాల్గొంటారా అనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

