కేజ్రీవాల్‌కు ఎల్జీ షాక్ : మద్యం పాలసీపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశం
అరవింద్ కేజ్రీవాల్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివాదాస్పద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దర్యాప్తునకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు.
న్యూఢిల్లీ : అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఢిల్లీ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివాదాస్పద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దర్యాప్తునకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నివేదిక ఆధారంగా ఎల్జీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.టెండర్లు ఖరారైన తర్వాత లిక్కర్ లైసెన్సుల మంజూరులో అనుచిత లబ్ధి చేకూర్చడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడిందని కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
2021-22లో లిక్కర్ లైసెన్సుదారులకు అనుచిత ప్రయోజనాలు వర్తింపచేయడంలో నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లకు పంపిన నివేదిక అనంతరం ఎల్జీ మద్యం పాలసీపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఎక్సైజ్ శాఖకు ఇన్చార్జ్ మంత్రిగా మనీష్ సిసోడియా వ్యవహరించిన క్రమంలో ఉన్నత రాజకీయ స్ధాయిలో నిబంధనలను ఉల్లంఘిస్తూ నోటిఫైడ్ ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని నివేదిక పేర్కొంది.
టెండర్లు ఖరారైన అనంతరం లిక్కర్ లైసెన్సుదారులకు సిసోడియా అనుచిత లబ్ధి కలిగించడంతోనే ఖజానాకు గండిపడిందని ప్రధాన కార్యదర్శి సమర్పించిన నివేదిక స్పష్టం చేసింది. కొవిడ్ మహమ్మారి డెల్టా వేవ్ విరుచుకుపడిన సమయంలో తీసుకువచ్చిన ఎక్సైజ్ పాలసీని పౌరసమాజం, విద్యాసంస్ధలు, తల్లితండ్రుల సంఘాలు, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

