‘మాస్క్ లేకుంటే జరిమానా’ ఆంక్షలు ఎత్తివేత..!
lift fine imposed |
న్యూఢిల్లీ : ఇకపై దేశ రాజధాని ఢిల్లీలో మాస్క్ ధరించని వ్యక్తులకు ఎలాంటి జరిమాన విధించబోమని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించడాన్ని కొనసాగించాలని ప్రజలను కోరింది. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌లు తప్పనిసరి చేస్తూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధించే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డీడీఎంఏ నిర్ణయించిందని ఢిల్లీ ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం కొవిడ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో సర్కారు కొవిడ్‌పై నిర్వహించిన గత సమీక్ష సమావేశంలో జరిమానాను ఎత్తివేసేందుకు నిర్ణయించిందని పేర్కొంది. కొవిడ్ పాజిటివిటీ రేటు గణనీయంగా పడిపోయిందని, టీకాలు వేసినందున ఆదేశాలను ఉపసంహరించినట్లు వివరించింది. ముందుజాగ్రత్తగా భారీ జనసమూహంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. కేసు కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ‘మాస్క్ తప్పనిసరి’ నిబంధనలు అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇటీవల ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగు చూడగా.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్ష సమావేశం నిర్వహించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

