ఢిల్లీ వరదలపై బీజేపీ బురద రాజకీయం
భారీ వర్షాలు, యమునా నది ఉగ్రరూపంతో..ఢిల్లీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. విపత్తువేళ ఆప్ సర్కార్‌కు సాయం చేయాల్సిన కేంద్రం మాటలతో కాలయాపన చేస్తున్నది. ఢిల్లీ సర్కారును నిందిస్తూ బీజేపీ ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వరదలపై సమీక్ష చేసి..కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతులు దులుపుకున్నారు. ఆర్మీని పంపాలని ఆప్ సర్కార్ పదే పదే కోరినా..సమయానికి కేంద్రం స్పందించలేదు.
- విపత్తు వేళ ఆప్‌పై ఆరోపణలు
న్యూఢిల్లీ, జూలై 15(నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు, యమునా నది ఉగ్రరూపంతో..ఢిల్లీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. విపత్తువేళ ఆప్ సర్కార్‌కు సాయం చేయాల్సిన కేంద్రం మాటలతో కాలయాపన చేస్తున్నది. ఢిల్లీ సర్కారును నిందిస్తూ బీజేపీ ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వరదలపై సమీక్ష చేసి..కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతులు దులుపుకున్నారు. ఆర్మీని పంపాలని ఆప్ సర్కార్ పదే పదే కోరినా..సమయానికి కేంద్రం స్పందించలేదు. ఢిల్లీ మంత్రి ఆతిషి శనివారం విలేకరులతో మాట్లాడుతూ, హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని ఢిల్లీ వైపే విడుదల చేస్తున్నారని, పంజాబ్, యూపీ వైపు మళ్లించడం లేదని ఆరోపించారు. దీనిపై హర్యానా ప్రభుత్వం స్పందించలేదు. మరోవైపు సహాయక చర్యలేవీ తమకు చేరటం లేదని ఢిల్లీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒడిశా తీరంలో భారీ వర్షాలు
ఒడిశా తీర ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి.రాబోయే నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎమ్‌డీ హెచ్చరించింది. జర్సుగూడలో అత్యధికంగా 118.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాజధాని భువనేశ్వర్, కటక్‌లలో వర్షాల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో వరదల కారణంగా ముగ్గురు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిద్వార్‌లో వరద నీరు పేరుకు పోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

