Delhi Excise Policy Case | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..
Delhi Excise policy case | ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు గురువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Delhi Excise policy case | ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు గురువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ గడువు ముగియడంతో సీబీఐ ఆయనను తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసిన విషయం తెలిసిందే.
కేజ్రీవాల్ అరెస్ట్ సరైన కారణం లేకుండా అరెస్టు జరిగిందని చెప్పలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ఈడీ వాయిదా కోరింది. కేజ్రీవాల్ బెయిల్‌ను రద్దు చేస్తే మళ్లీ అరెస్టు చేస్తారా? అని హైకోర్టు ఈడీని ప్రశ్నించింది. కోర్టు ఈ కేసును సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తెలిసిందే. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం సీబీఐ కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
Read Also :
-
PM Modi | వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
-
NGT: కాజిరంగా పార్క్ వద్ద ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం.. సుమోటో కేసు దాఖలు చేసిన ఎన్జీటీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

