సోమవారం 25 మే 2020
National - Apr 06, 2020 , 19:49:40

మీరాన్ హైద‌ర్ కు 9 రోజుల క‌స్ట‌డీ...

మీరాన్ హైద‌ర్ కు 9 రోజుల క‌స్ట‌డీ...

న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం ఈశాన్య‌ఢిల్లీలో జ‌రిగిన అల్ల‌ర‌కు సంబంధించి జామియా మిలియా ఇస్లామియా యూనివ‌ర్సిటీ విద్యార్థి  మిరాన్ హైద‌ర్ (35) ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే స‌ద‌రు విద్యార్థి పోలీస్ క‌స్ట‌డీని ఢిల్లీ కోర్టు 9 రోజులు పొడిగించింది. ఢిల్లీ అద‌న‌పు చీఫ్ మెట్రో పాలిట‌న్ మేజిస్ట్రేట్ సుధీర్ కుమార్ సిరోహి..హైద‌ర్ ను విచారణ నిమిత్తం క‌స్ట‌డీలోకి పంపించేందుకు అనుమ‌తి ఇచ్చారు. 

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా జ‌రిగిన హింస‌కు సంబంధించిన ఘ‌ట‌న‌లో.. ఈశాన్య ఢిల్లీలో మ‌త ప‌ర‌మైన అల్ల‌ర్ల‌కు కుట్ర చేశాడ‌నే ఆరోప‌ణ‌ల్లో జామియా మిలియా ఇస్లామియా వ‌ర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి అయిన మీరాన్ హైద‌ర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మీరాన్ హైద‌ర్ ఢిల్లీ విభాగం ఆర్జేడీ యూత్ వింగ్ అధ్య‌క్షుడిగా ఉన్నాడు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo