న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనకు మంజూరైన మధ్యంతర బెయిలును మరో వారం రోజులపాటు పొడిగించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా లిస్టింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది.
రెగ్యులర్ బెయిలు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చిందని, అందువల్ల ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని వివరించింది.