Rahul Gandhi | రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు.. నేడు తీర్పు ఇవ్వనున్న గుజరాత్ హైకోర్టు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజకీయ భవితవ్యం నేడు తేలనుంది. మోదీ ఇంటిపేరు (Modi surname) కేసులో గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) శుక్రవారం కీలక తీర్పు (Verdict) వెలువరించనుంది.
అహ్మదాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజకీయ భవితవ్యం నేడు తేలనుంది. మోదీ ఇంటిపేరు (Modi surname) కేసులో గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) శుక్రవారం కీలక తీర్పు (Verdict) వెలువరించనుంది. పరువు నష్టం కేసులో (Defamation case) రెండేండ్లు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు (Surat Court) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది.
ఈ కేసులో కోర్టు స్టే విధించినట్లయితే రాహుల్ అనర్హత రద్దయ్యే అవకాశం ఉంది. ఒక వేళ అలాకానట్లయితే రాహుల్ గుజరాత్ కోర్టులోని ఉన్నత ధర్మాసనం ముందు అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుంది. సూరత్ కోర్టు విధించిన రెండేండ్ల శిక్షను న్యాయస్థానం సమర్థించినట్లయితే.. ఆరేండ్లపాటు రాజకీయాలకు రాహుల్ అనర్హుడవుతాడు.
అసలు కేసేంటి..
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ.. ‘దొంగలందరి ఇంటిపేరు మోదీయే’ ఎందుకంటూ.. ప్రశ్నించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతం వ్యక్తంచేసిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ (Purnesh Modi).. సూరత్ న్యాయస్థానంలో పరువునష్టం దావావేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ తన వాదనను వినిపించారు. అయితే పూర్తిస్థాయి విచారణ అనంతరం కోర్టు.. ఈ ఏడాది మార్చి 23న ఆయనను దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

