Declare National Emergency | ఎండలకు వందల సంఖ్యలో మృతి.. కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రాజస్థాన్ హైకోర్టు
Declare National Emergency | దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌పైగా నమోదవుతున్నాయి. ఎండలకు తాళలేక వందలాది మంది మరణించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
జైపూర్: దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌పైగా నమోదవుతున్నాయి. ఎండలకు తాళలేక వందలాది మంది మరణించారు. ఈ నేపథ్యంలో
రాజస్థాన్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. (Declare National Emergency) రాజస్థాన్‌తోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దీంతో ఎండలను తట్టుకోలేక వడదెబ్బ బారిన పడి వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. అయితే జనాన్ని కాపాడేందుకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
కాగా, రాజస్థాన్ హైకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎండలకు జనం పిట్టల్లా రాలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ అనూప్ కుమార్ దాండ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. వరదలు, తుఫానుల మాదిరిగా వేడి, చలి గాలులను జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని కోర్టు పేర్కొంది.
మరోవైపు వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించే చర్యలు చేపట్టాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే ‘హీట్ యాక్షన్ ప్లాన్’ను సమర్థవంతంగా అమలు చేసేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వివిధ శాఖలతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ‘మనం వెళ్లగలిగే మరో గ్రహం లేదు. మనం ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోతే, మన భవిష్యత్ తరాల వృద్ధి అవకాశాలను కోల్పోతాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

