Anmol Gagan Maan | ‘రాజకీయాలు వీడాలని నిర్ణయించా’.. ఆప్ ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ రాజీనామా
Anmol Gagan Maan | రాజకీయాలను వీడాలని నిర్ణయించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ తెలిపారు. శనివారం తన శాసన సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామా పత్రం అందజేశారు.
చండీగఢ్: రాజకీయాలను వీడాలని నిర్ణయించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ (Anmol Gagan Maan) తెలిపారు. శనివారం తన శాసన సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామా పత్రం అందజేశారు. ‘నా హృదయం బరువెక్కింది, కానీ నేను రాజకీయాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నా. ఎమ్మెల్యే పదవికి నా రాజీనామాను స్పీకర్ ఆమోదించాలి. పార్టీకి నా శుభాకాంక్షలు. పంజాబ్ ప్రభుత్వం ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉంటుందని నేను ఆశిస్తున్నా’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాగా, పంజాబ్ గాయని అయిన అన్మోల్ గగన్ మాన్ 2022లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖరార్ స్థానం నుంచి ఆప్ తరుఫున పోటీ చేసి గెలిచారు. సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వంలో మంత్రిగా అన్మోల్ కొంతకాలం పనిచేశారు. పర్యాటకం-సంస్కృతి, పెట్టుబడి ప్రమోషన్, కార్మిక, ఆతిథ్యం వంటి కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు.
మరోవైపు గత ఏడాది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అన్మోల్ గగన్ మాన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రముఖ పంజాబీ గాయని. సూట్, గైంట్ పర్పస్, షెర్ని వంటి పాటలతో ప్రసిద్ధి చెందారు.
Also Read:
Cop’s Son Car Race | పోలీస్ కొడుకు కారు రేస్.. నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి
Girl set on fire | ఒడిశాలో మరో దారుణం.. అమ్మాయికి నిప్పంటించిన ముగ్గురు
Watch: వర్షం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

