తిరువనంతపురం: కేరళలో (Kerala) జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మళప్పురం (Malappuram) జిల్లాలోని తన్నూర్ సమీపంలో పురపుజా నదిలో ఓ డబుల్ డెక్కర్ పడవ (Houseboat Tragedy) బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 22 మంది మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో 30-40 మంది ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తున్నది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక మత్య్సకారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, కేరళ సీఎం పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మలప్పురం జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు.
#WATCH | Search and rescue operation underway after a tourist boat capsized in Kerala's Malappuram district last night.
As of now, 21 people have died in the incident. pic.twitter.com/YppXdQmpZx
— ANI (@ANI) May 8, 2023
केरल: मलप्पुरम ज़िले के तनूर के पास एक पर्यटक नाव पलट गई। रेस्क्यू ऑपरेशन अब भी जारी है। अब तक 21 लोगों के मृत्यु की हो चुकी है।
(वीडियो देर रात किए गए सर्च ऑपरेशन का है) pic.twitter.com/3sAPE0E5QT
— ANI_HindiNews (@AHindinews) May 8, 2023
Pained by the loss of lives due to the boat mishap in Malappuram, Kerala. Condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be provided to the next of kin of each deceased: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 7, 2023
#WATCH | Kerala: Visuals from the spot where a tourist boat capsized near Tanur in Malappuram district leaving atleast 18 people dead. pic.twitter.com/292uW2LuCN
— ANI (@ANI) May 7, 2023