ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌కు వేధింపులు.. వాహనంలోకి లాగేందుకు చేయిపట్టి ఈడ్చిన డ్రైవర్
దేశ రాజధానిలో మహిళలకు రక్షణను స్వయంగా పరిశీలించేందుకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ప్రయత్నించారు. గురువారం ఉదయం 3.11 గంటలకు తన బృందంతో కలిసి బయటకు వెళ్లారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతను స్వయంగా తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఒక డ్రైవర్ ఆమెను కారులోకి లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో స్వాతి మలివాల్ చేతిని పట్టుకుని కొంత దూరం వాహనంతో ఈడ్చుకెళ్లాడు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. దేశ రాజధానిలో మహిళలకు రక్షణను స్వయంగా పరిశీలించేందుకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ప్రయత్నించారు. గురువారం ఉదయం 3.11 గంటలకు తన బృందంతో కలిసి బయటకు వెళ్లారు.
కాగా, ఎయిమ్స్ హాస్పిటల్ సమీపంలో తన బృందాన్ని దూరంగా ఉంచిన స్వాతి మలివాల్ ఒంటరిగా రోడ్డుపై ఉన్నారు. ఇంతలో బాలెనో కారులో అటుగా వచ్చిన 47 ఏళ్ల హరీశ్ చంద్ర, మద్యం మత్తులో ఆమెను వేధించాడు. తన వాహనంలోకి ఎక్కాలంటూ బలవంతం చేశాడు. ఆమె నిరాకరించగా కారుతో కాస్త ముందుకు వెళ్లాడు. యూ టర్న్ తీసుకున్న అతడు మళ్లీ స్వాతి మలివాల్ వద్దకు వచ్చాడు. కారులోకి ఎక్కాలని మరోసారి ఆమెను బలవంతం చేశాడు.
మరోవైపు కారు విండో నుంచి చేయి లోనికి జాపి ఆ డ్రైవర్‌ను పట్టుకునేందుకు స్వాతి మలివాల్ ప్రయత్నించారు. అయితే అతడు ఆమె చేయి పట్టుకుని విండో అద్దం మూసేశాడు. దీంతో ఆమె చేయి ఇరుక్కుంది. అతడు కారును డ్రైవ్ చేస్తూ 15 మీటర్ల దూరం వరకు ఆమెను ఈడ్చుకెళ్లాడు.
కాగా, దూరంగా ఉన్న ఢిల్లీ మహిళా కమిషన్ బృందం దీనిని గమనించి వెంటనే స్పందించింది. ఆ కారును అడ్డుకుని నిలువరించింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేయడంతోపాటు డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్‌ను వేధించిన హరీశ్ చంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

