ధర్మశాల: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా వేలాది మంది ప్రజలు బౌద్ధుల ఆధ్మాత్మిక గురువు 14వ దలైలామా 90వ జన్మదిన ఉత్సవానికి హాజరయ్యారు. ధర్మశాలలో దలైలామా ఆలయంగా పిలుచుకునే సుగ్లఖాంగ్ ప్రాంగణంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. అయితే దలైలామా వారసునిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రజలు తనపై చూపుతున్న ప్రేమే మానవులందరికీ సేవ చేసే స్ఫూర్తిని తనకు కలుగచేస్తోందని దలైలామా చెప్పారు.
టిబెటన్ బౌద్ధుల పునర్జన్మ విధానం కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అధికారం దలైలామాకు లేదని భారత్లోని చైనా రాయబారి జూ ఫేహాంగ్ ఆదివారం ప్రకటించారు. శతాబ్దాల నాటి మతపరమైన సంప్రదాయాన్ని ఆయన మార్చలేరని ఫేహాంగ్ వ్యాఖ్యానించారు.