Loksabha Elections 2024 : ఈడీ, సీబీఐలా ఈసీని కూడా వాడుకోవాలని చూస్తున్నారు : కాషాయ పార్టీపై డీ. రాజా ఫైర్
Loksabha Elections 2024 : పాలక బీజేపీ నేతలపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ. రాజా తీవ్ర విమర్శలు గుప్పించారు.
Loksabha Elections 2024 : పాలక బీజేపీ నేతలపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ. రాజా తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేతలు ఈడీ, ఐటీ, సీబీఐ తరహాలో ఈసీ కూడా తమ కనుసన్నల్లో పని చేస్తుందని అనుకుంటున్నారని ఆరోపించారు. ఈసీ రాజ్యాంగ సంస్ధని, ఇది స్వతంత్రంగా వ్యవహరించాలని చెప్పారు. ఈసీ ఎన్నికలను స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించేలా చూడటంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్ధులకు సమాన అవకాశాలు ఇచ్చేలా వ్యవహరించాలని అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెప్పుచేతల్లో ఈసీ వ్యవహరించదని, ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేయదని డీ. రాజా పేర్కొన్నారు. ఈసీ తమ గుప్పిట్లో ఉండే సంస్ధ కాదని బీజేపీ నేతలు గుర్తెరగాలని అన్నారు. కాగా, మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తోసిపుచ్చారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాహుల్పై కఠిన చర్యలు చేపట్టాలని హర్దీప్ సింగ్ సోమవారం ఈసీకి విజ్ఞప్తి చేశారు.
రాహుల్కు కేవలం నోటీసులు జారీ చేస్తే సరిపోదని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ రాంలీలా మైదానంలో జరిగిన విపక్ష ఇండియా కూటమి ర్యాలీలో రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరకర అంశాలను ప్రస్తావించారని అన్నారు. బీజేపీకి ఈ ఎన్నికలు మ్యాచ్ ఫిక్సింగ్ అని, ఈసీలో ప్రభుత్వం సొంత మనుషులున్నారని, మోదీ ఈవీఎంలు లేకుండా గెలవలేరని పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. తాము ఈ విషయాలన్నింటినీ ఈసీ దృష్టికి తీసుకువచ్చామని, ఈ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చిందని, వీటన్నింటికి సరైన ఆధారాలు లేవని పేర్కొందని చెప్పారు.
Read More :
Tillu Square | ఐపీఎల్ మేనియాను బీట్ చేసి మరీ.. టిల్లు 2 తాజా వసూళ్లు ఇవే..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

