పేరెంట్స్, ఫ్రెండ్స్ సపోర్ట్ ఇచ్చారు: సివిల్స్ టాపర్ శ్రుతి శర్మ
న్యూఢిల్లీ: సివిల్స్ 2021లో శ్రుతి శర్మ టాప్ ర్యాంక్ సాధించింది. తన విజయ ప్రస్థానంలో పేరెంట్స్, ఫ్రెండ్స్ పాత్ర కీలకమైందని ఆమె అన్నారు. వారెంతో సపోర్ట్ ఇచ్చినట్లు ఆమె చెప్పారు. కష్టంతో పాటు సహనం చాలా అవసరమన్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో శ్రుతి శర్మ చదివింది. అయితే ఫస్ట్ ర్యాంక్ వస్తుందని తానేమీ అంచనా వేయలేదని చెప్పింది. ఫలితాలు తనను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని ఆమె అన్నారు. తన జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ క్రెడిట్ దక్కుతుందని, ముఖ్యంగా పేరెంట్స్‌కు అని ఆమె తెలిపారు. తనకు తన పేరెంట్స్ ఎంతో సపోర్ట్ ఇచ్చారని, ఫ్రెండ్స్ కూడా మంచి గైడెన్స్ ఇచ్చినట్లు ఆమె చెప్పారు.
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) నుంచి శ్రుతి శర్మ పీజీ చదివారు. గడిచిన నాలుగేళ్ల నుంచి ఆమె సివిల్స్ కోసం ప్రిపేరవుతోంది. జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో ఆమె స్టూడెంట్‌గా ఉన్నారు. యూజీపీ ఫండ్స్‌తో ఆర్సీఏ నడుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈ కోచింగ్ అకాడమీ నుంచి 23 మంది విద్యార్థులు పరీక్ష క్లియర్ అయినట్లు జామియా అధికారి ఒకరు తెలిపారు. 2021 పరీక్షల్లో మొదటి నాలుగు ర్యాంక్‌లు మహిళలే దక్కించుకున్నారు. 685 మంది సివిల్స్ క్వాలిఫై అయ్యారు.
రెండవ ర్యాంక్ సాధించిన అంకితా అగర్వాల్.. ఢిల్లీ వర్సిటీ నుంచి ఎకనామిక్స్(హానర్స్)లో గ్రాడ్యుయేట్ అయ్యింది. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సబ్జెటెక్తో ఆమె పరీక్ష రాశారు. గామిని సింగ్లాకు మూడవ ర్యాంక్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్‌లో ఆమె బీటెక్ చేశారు. సోషియాలజీని ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నది. టాప్ 25 ర్యాంకుల్లో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

