న్యూఢిల్లీ, అక్టోబర్ 12: క్రెడిట్ కార్డుల సమాచారం పెద్ద ఎత్తున హ్యాక్ అయినట్టు సింగపూర్‌కు చెందిన సైబర్ నిఘా సంస్థ క్లౌడ్ఎస్ఈకే వెల్లడించింది. 1.2 కోట్లమంది క్రెడిట్ కార్డు ఖాతాదారుల ఆర్థిక సమాచారం తమవద్ద ఉన్నట్టు ఓ రష్యన్ హ్యాకర్ల వెబ్సైట్ వెల్లడించిన అనంతరం బైడెన్‌క్యాష్ అనే వెబ్సైటు 80 లక్షల మంది సమాచారాన్ని బహిరంగంగా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఎస్బీఐ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తదితర కార్డుల ఖాతాదారుల వివరాలు ఉన్నట్టు తెలుస్తున్నది. బైడెన్ క్యాష్ డార్క్ వెబ్ సైటులోకి ఎవరైనా వెళ్లి ఖాతాదారుల సమాచారాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే వీలుండటం గమనార్హం.