Corona Virus | ఎండమిక్ దశకు కొవిడ్.. మరో పది రోజుల పాటు కొనసాగనున్న వైరస్ ఉద్ధృతి
Corona Virus | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో 10 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
Corona Virus | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వేలల్లో కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో 10 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
ప్రస్తుతం మన దేశంలో కొవిడ్ ఎండమిక్ దశ (Covid Endemic Stage) కు చేరుకుందని అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ క్రమంలోనే రాబోయే 10-12 రోజుల పాటు కేసుల ఉద్ధృతి కొనసాగుతందని చెప్పాయి. ఆ తర్వాత నెమ్మదిగా కొవిడ్ తగ్గుముఖం పడుతుందని అంచనా వేశాయి. ప్రస్తుతం ఒమిక్రాన్, దాని ఉపరకమైన ఎక్స్‌బీబీ.1.16 (XBB.1.16) కారణంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉన్నట్లుగా వైద్య వర్గాలు వెల్లడించాయి.
‘దేశంలో కొవిడ్ ఎండమిక్ దశకు చేరుకుంది. వచ్చే 10-12 రోజులు కొత్త కేసుల ఉద్ధృతి కొనసాగుతుంది. ఆ తర్వాత నుంచి కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. కేసులు కూడా భారీగా తగ్గుతాయి. ఇది క్రమంగా ఎండమిక్ దశలోకి వెళ్తుంది’ అని వెల్లడించాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాయి.
కాగా, ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా భారత్‌లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో 21.6 శాతం, మార్చిలో 35.8 శాతం మేర కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించింది. ఇక నిన్న 7,830 కరోనా కేసులు నమోదుకాగా, ఆ సంఖ్య నేడు పది వేలకు దాటింది. గత 24 గంటల వ్యవధిలో 10,158 కొత్త కేసులు బయటపడ్డాయి. 19 మంది మృతిచెందారు.
Also Read..
India Corona | 10 వేలు దాటిన కొత్త కేసులు.. 19 మంది మృతి..!
Sundar Pichai | గూగుల్‌లో మరిన్ని లేఆఫ్స్.. ప్రకటించిన సీఈవో సుందర్ పిచాయ్
Bathinda Military Station | బుల్లెట్ గాయంతో మరో జవాను మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

