Counting | రేపే కౌంటింగ్.. మరికొన్ని గంటల్లో తేలనున్న ముఖ్యమంత్రుల భవితవ్యం..!
Counting | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఓట్ల లెక్కింపు రేపు జరుగనుంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. పశ్చిమ బెంగాల్ (West Begal), తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala), అస్సాం (Assam) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
Counting : నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఓట్ల లెక్కింపు రేపు జరుగనుంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. పశ్చిమ బెంగాల్ (West Begal), తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala), అస్సాం (Assam) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం ఏ రాష్ట్రంలో ఎవరిది గెలుపు అనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఎన్నికల సంఘం (Election Commission of India) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మోహరించింది.
ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో గతంలో మాదిరిగానే హింస చెలరేగే అవకాశం ఉన్నందున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం 11 జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల ఫలితాల ద్వారా కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, పినరయి విజయన్‌ల భవితవ్యం తేలనుంది. గతానికి భిన్నంగా ఈసారి ఆయా రాష్ట్రాల్లో భారీగా పోలింగ్ నమోదైంది. పలు ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలను వెల్లడించాయి. దాంతో ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపై ఎక్కువగా ఉంటుందని రాజకీయా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక ఎగ్జిట్‌పోల్స్ అంచనాల ప్రకారం అస్సాం, పుదుచ్చేరిల్లో అధికార మార్పిడి జరగబోదని, రెండు చోట్లా ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమియే మళ్లీ అధికారాన్ని చేపట్టబోతోందని సర్వే సంస్థలన్నీ ముక్తకంఠంతో చెప్పాయి. కానీ పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఫలితాల గురించే సర్వే సంస్థలు మిశ్రమ ఫలితాలను వెల్లడించాయి. అయితే బెంగాల్లో మమతాబెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓటమిపాలు కానుందని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. తమిళనాడులో డీఎంకే అధికారం నిలబెట్టుకుంటుందని మెజారిటీ సంస్థలు చెప్పినా.. ఒకటి రెండు సర్వే సంస్థలు మాత్రం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారం చేపట్టబోతోందని అంచనా వేశాయి. ఇక కేరళలో పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమికి ఈసారి ఓటమి తప్పదని సర్వే సంస్థలు చెప్పాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

