11 గంటలకు రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు ప్రారంభం..
Presidential Election | దేశ 16వ రాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభవుతుంది.
హైదరాబాద్: దేశ 16వ రాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభవుతుంది. మొదట ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. అనంతరం రాష్ట్రాలవారీగా ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇంగ్లిష్ అక్షరక్రమంలో ఒక్కో రాష్ట్ర ఎమ్మెల్యేల ఓట్లను లెక్కిస్తారు. మొత్తం ఓట్ల కౌంటింగ్ అనంతరం తుది ఫలితాలను ప్రకటిస్తారు. సాయంత్రం 4 గంటల వరకు ఫలితాలు వెలువనున్నాయి. ఈ నెల 18న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. కాగా, ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ పదవీకాలం ఈనెల 24తో ముగియనుంది. ఆనవాయితీ ప్రకారం నూతన దేశాధినేత 25న ప్రమాణ స్వీకారం చేస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

