Bengal Governor | కూచ్ బెహర్ పర్యటన రద్దు చేసుకోండి.. బెంగాల్ గవర్నర్కు ఈసీ సూచన
Bengal Governor | పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ప్రతిపాదించిన కూచ్ బెహర్ పర్యటననను రద్దు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) సూచించింది. ఈ నెల 18, 19 తేదీల్లో తలపెట్టిన ఆయన పర్యటన మోడల్ కోడ్ను ఉల్లంఘించినట్లువుతుందని తెలిపింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ (Bengal Governor) సీవీ ఆనంద బోస్ ప్రతిపాదించిన కూచ్ బెహర్ పర్యటననను రద్దు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) సూచించింది. ఈ నెల 18, 19 తేదీల్లో తలపెట్టిన ఆయన పర్యటన మోడల్ కోడ్ను ఉల్లంఘించినట్లువుతుందని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని, అందుకే కూచ్ బెహర్ను సందర్శిస్తున్నారని బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ అక్కడ పర్యటించకుండా అడ్డుకోవాలని కోరుతూ ఈసీకి లేఖ రాసింది. స్పందించిన ఈసీ ఈ నెల 18, 19 తేదీల్లో కూచ్ బెహర్లో పర్యటించవద్దని గవర్నర్కు సూచించింది.
కాగా, లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరుగనున్నది. దీంతో బుధవారం సాయంత్రంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. అలాగే 48 గంటలపాటు సైలెంట్ సమయాన్ని పాటించాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో ఓటర్లు కాని వీఐపీలు, నాయకులు ఆ ప్రాంతాన్ని వీడాల్సి ఉంటుంది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంతోపాటు వీఐపీల భద్రత కోసం పోలీసులు, భద్రతా సిబ్బందిపై అదనపు పనిభారం పడకుండా ఉండేందుకు ఈ నియమం పాటిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కూచ్ బెహర్ పర్యటనను బెంగాల్ గవర్నర్ రద్దు చేసుకోవాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

