Karnataka contractor suicide | బకాయిలు చెల్లించకపోవడంతో.. కర్ణాటక కాంట్రాక్టర్ ఆత్మహత్య
Karnataka contractor suicide | బకాయిలు చెల్లించకపోవడంతో కర్ణాటకకు చెందిన కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ సంస్థ తనకు లక్షల్లో బకాయిలు చెల్లించాల్సి ఉందని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
బెంగళూరు: బకాయిలు చెల్లించకపోవడంతో కర్ణాటకకు చెందిన కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Karnataka contractor suicide) ప్రభుత్వ సంస్థ తనకు లక్షల్లో బకాయిలు చెల్లించాల్సి ఉందని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. అలాగే సోదరులు కూడా తనకు లక్షల్లో అప్పు చెల్లించాల్సి ఉందని ఆ లేఖలో ఆరోపించాడు. దావణగెరెకు చెందిన కాంట్రాక్టర్ అయిన 50 ఏళ్ల ప్రసన్న శుక్రవారం సంతాబెన్నూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి చేసిన కాంట్రాక్ట్ పనులకు కర్ణాటక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ (కేఆర్ఐడీఎల్) బిల్లులు చెల్లించలేదని ఆరోపించాడు. సోదరులైన నాగరాజ్, శ్రీనివాస్ కూడా తనకు పెద్ద మొత్తంలో డబ్బులు బకాయిపడ్డారని పేర్కొన్నాడు. ఆ సంస్థతోపాటు సోదరులు కలిసి మొత్తంగా రూ.80 లక్షలు తనకు చెల్లించాల్సి ఉందంటూ సూసైడ్ లేఖ రాశాడు.
కాగా, కాంట్రాక్టర్ ప్రసన్న ఆత్మహత్యపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేఆర్ఐడీఎల్ అధికారులతోపాటు సోదరులైన నాగరాజ్, శ్రీనివాస్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాంట్రాక్టర్ సూసైడ్ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Contractor
- Dies
- dues
- karnataka
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

