Uddhav Thackeray | అయోధ్యలో రామ మందిరం నా తండ్రి కల.. ప్రతిష్టాపన రాష్ట్రపతి నిర్వహించాలి: ఉద్ధవ్ ఠాక్రే
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) మరోసారి బీజేపీపై మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే కల అని అన్నారు. ప్రాణ ప్రతిష్టాపన కార్యాక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) మరోసారి బీజేపీపై మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే కల అని అన్నారు. ప్రాణ ప్రతిష్టాపన కార్యాక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలన్న తన తండ్రి బాలాసాహెబ్ కల నెరవేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను రాముడి భక్తుడితోపాటు దేశ భక్తుడినని తెలిపారు. అయితే అంధ భక్తుడ్ని కాదన్నారు.
కాగా, గుజరాత్లో సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ కార్యక్రమం దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా జరిగిందని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ‘ఇది (అయోధ్యలో రామ మందిరం) జాతీయ గర్వకారణం, దేశ ఆత్మగౌరవానికి సంబంధించినది. ప్రతిష్టాపన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ముర్ము నిర్వహించాలి’ అని అన్నారు. అలాగే విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపన గురించి శంకరాచార్యులతో చర్చించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు జనవరి 22న తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి నాసిక్‌లోని చారిత్రాక కాలారం ఆలయాన్ని సందర్శిస్తామని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. అక్కడ గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా 1992 నాటి కర సేవలో పాల్గొన్న శివ సైనికులను సత్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు. కాగా, ఆ తర్వాత రోజు నాసిక్‌లో శివసేన (యూటీబీ) సమావేశం జరుగుతుందని ఆ పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగిస్తారని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

