Conrad Sangma | మేఘాలయాలో కాన్రాడ్ సంగ్మాకు మద్దతు ప్రకటించిన యూడీపీ, పీడీఎఫ్.. 45కు చేరిన ఎండీఏ కూటమి బలం
మేఘాలయాలో (Meghalaya) ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. తాజా మాజీ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు (Conrad Sangma) స్థానిక పార్టీలైన యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (UDP), పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (PDF) మద్దతు ప్రకటించాయి.
షిల్లాంగ్: మేఘాలయాలో (Meghalaya) ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. తాజా మాజీ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు (Conrad Sangma) స్థానిక పార్టీలైన యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (UDP), పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (PDF) మద్దతు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే 13 స్థానాలు అధికమయ్యాయి. ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సంగ్మా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని 60 స్థానాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు గత నెల 27న జరిగిన ఎన్నికలు జరిగాయి. ఈ నెల 2న వెలువడిన ఫలితాల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 26 స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాని పాత మిత్రపక్షమైన బీజేపీ 2, హెచ్ఎస్పీడీపీ 2, కాంగ్రెస్ (Congress) 5, తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఐదు చొప్పున, యూడీపీ 11, పీడీఎఫ్ 2 స్థానాల చొప్పున గెలుపొందాయి. దీంతో అక్కడ హంగ్ ఏర్పడింది.
అయితే సంగ్మాకు బీజేపీ, హెచ్ఎస్పీడీపీ, మరో ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతు ప్రకటించారు. దీంతో ఎన్పీపీ బలం 32కు చేరింది. తాజాగా యూడీపీ, పీడీఎఫ్లు కూడా సంగ్మా నేతృత్వంలోని మేఘాలయా డెమొక్రటిక్ అలయన్స్ (MDA)లో భాగస్వాములుగా చేరాయి. ఈనేపథ్యంలో ఎండీఏ మొత్తం బలం 45కు చేరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

