మార్చి 31 నుంచి ధరల మంటపై కాంగ్రెస్ పోరుబాట
ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల ధరల మంటకు నిరసనగా మెహంగి-ముక్త్భారత్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా మూడు దశల పోరాటానికి కాంగ్రెస్ సన్నద్ధమైంది.
న్యూఢిల్లీ : ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల ధరల మంటకు నిరసనగా మెహంగి-ముక్త్భారత్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా మూడు దశల పోరాటానికి కాంగ్రెస్ సన్నద్ధమైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకూ ధరల పెరుగుదలకు నిరసనగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలను నిర్వహించనుంది. తొలి దశ పోరులో మార్చి 31ను గ్యాస్ సిలిండర్ షహీది దివస్‌గా పాటించాలని నిర్ణయించింది. మార్చి 31 ఉదయం ధరల పెంపునకు నిరసనగా డప్పులు మోగించి, గంట కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపుఇచ్చింది.
ఈ నెలలో గ్యాస్ సిలిండర్ ధరను సిలిండర్‌కు రూ 50 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఎల్పీజీ సిలిండర్ ధర పెంపునకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు సిలిండర్లకు దండలు వేసి ఊరేగిస్తారని, ధరల మంటపై ప్రజలను చైతన్యపరుస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 4 వరకూ పార్టీ సారధ్యంలో జిల్లా, బ్లాక్ స్ధాయిలో ధర్నాలు, ప్రదర్శనలు చేపడతామని చెప్పారు.
ఏప్రిల్ 7న రాష్ట్ర రాజధానుల్లో కాంగ్రెస్ శ్రేణులు, ఎన్జీవోలు, ప్రజలు, సామాజిక సంస్ధలతో కలిసి ప్రదర్శనలు జరుగుతాయని సుర్జీవాలా వెల్లడించారు. పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరల పెంపుతో మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ సామాన్యులపై పెను భారం మోపిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ccongress
- price rise
- Protest
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

