Congress Cross Voting Tensions | ఛత్తీస్‌గఢ్‌కు హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు!
Congress Cross Voting Tensions | క్రాస్ ఓటింగ్ భయంతో కాంగ్రెస్ హర్యానా ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు.
Congress Cross Voting Tensions | ఈ నెల 10న జరుగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకున్నది. ఈ నేపథ్యంలో హర్యానా ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తరలించాలని నిర్ణయించింది. పార్టీ ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశించింది. దీంతో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా గురువారం ఎంపీ దీపిందర్ సింగ్ హూడా నివాసానికి చేరుకున్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా అప్సెట్ కాలేదు. ఎమ్మెల్యేలంతా (ఛత్తీస్‌గఢ్) వెళతారు. హర్యానా ఎమ్మెల్యేలను సురక్షితంగా కాపాడుకోవాలని బీజేపీకి చెప్పదలుచుకున్నా అని ఢిల్లీలో హూడా మీడియాతో చెప్పారు.
హర్యానా నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీజేపీ, దాని మిత్రపక్షాలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ముగ్గురు పోటీలో ఉన్నారు. దీంతో రాజ్యసభ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎమ్మెల్యేలంతా హూడా నివాసం నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయానికి తరలి వెళ్లారు. వారు పార్టీ నిర్వహించే చింతన్ అండ్ పరిరక్షణ్ శివిర్‌లో పాల్గొంటారని హూడా తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ బలం తమకు ఉందని దీపిందర్ సింగ్ హూడా వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి తమ ఎమ్మెల్యేల మద్దతుపై భయం పట్టుకుందని పేర్కొన్నారు. బీజేపీ తనకు మద్దతునిచ్చే జేజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. హర్యానాలోని బీజేపీ-జేజేపీ సంకీర్ణ కూటమి సర్కార్‌కు తమకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేల గురించి భయం పట్టుకుందన్నారు. ఇదిలా ఉంటే, హర్యానా రాజ్యసభ ఎన్నికల ఇన్‌చార్జీగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను బీజేపీ నియమించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

