దీదీకి కలిసొచ్చిన కాషాయ పార్టీ తీరు : కాంగ్రెస్

కోల్‌కతా: కాషాయ పార్టీ మతతత్వ విధానాలు, బెదిరింపు రాజకీయాలే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రాజకీయంగా ఉపకరించాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బీజేపీని కేవలం దీదీయే మట్టికరిపించలేదని, ఎంకే స్టాలిన్, కేజ్రీవాల్, పినరయి విజయన్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు ఆయా రాష్ట్రాల్లో ఓడించారని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వం అనుసరించే మతతత్వ, అణిచివేత వైఖరితో మమతా బెనర్జీ లాభపడ్డారని చెప్పారు. కాషాయ పార్టీ తీరు తోనే బెంగాల్ ఎన్నికల్లో దీదీ లాభపడ్డారని పేర్కొన్నారు.
బీజేపీపై, ఆ పార్టీ ఎన్నికల యంత్రాంగంపై దీదీ దీటుగా పోరాడారు..అద్భుత విజయం సాధించారు..కానీ చాలా మంది ప్రాంతీయ నేతలు కాషాయ పార్టీని ఓడించారన్న విషయం గుర్తెరగాలని అధిర్ అన్నారు. బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ లేకుండా మహాకూటమి ఏర్పాటు విజయం సాధించలేదని విపక్షాలకు హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉనికితో అతిపెద్ద విపక్ష పార్టీగా ఉందని గుర్తుచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

