గుజరాత్ పోరు | సానుభూతి కోసం మోదీ అసత్యాలు : మల్లికార్జున్ ఖర్గే
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా డైలాగ్ వార్ ముదురుతోంది.
అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా డైలాగ్ వార్ ముదురుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి పొందేందుకు పేదవాడినని చెబుతారని, అయితే తాను అంటరానివారిలో ఒకడినని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
ప్రధాని మోదీ అసత్యాలు ప్రచారం చేసే నేతని ఆయన మండిపడ్డారు. నర్మదా జిల్లాలోని దెదిపదలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు. తాను అంటరాని కులానికి చెందిన వాడినని ఖర్గే చెప్పుకొచ్చారు. మోదీ మాత్రం ప్రజల్లో సానుభూతి కోసం పేదవాడనని ప్రచారం చేసుకుంటారని కానీ ప్రజలు తెలివైనవారని..ఎన్నిసార్లు మీరు అబద్దాలు చెబుతారని మోదీని ఖర్గే నిలదీశారు.
ఇక 182 మంది సభ్యులు కలిగిన గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, డిసెంబర్ 5 తేదీల్లో పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో పాలక బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా ఎలాగైనా బీజేపీని మట్టికరిపించాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక పంజాబ్‌లో విజయంతో ఊపుమీదున్న ఆప్ గుజరాత్‌లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

