Congress Party: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ పార్టీ
Congress Party: వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఆ బిల్లు పాసైన విషయం తెలిసిందే. ఆ బిల్లుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లనున్నట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేత జయరాం రమేశ్ తెలిపారు.
న్యూఢిల్లీ: బీజేపీ సర్కారు తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ(Congress Party) తెలిపింది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఆ బిల్లు పాసైన విషయం తెలిసిందే. ఆ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అయితే ఆ బిల్లుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లనున్నట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేత జయరాం రమేశ్ తెలిపారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. 2019లో ప్రభుత్వం తెచ్చిన సీఏఏను సుప్రీంలో సవాల్ చేశామని, 2005 ఆర్టీఐ చట్టం సవరణను ప్రశ్నిస్తూ సుప్రీంలో సవాల్ చేశామన్నారు. ఎన్నికల నిర్వహణ అంశంపై తెచ్చిన సవరణలను ప్రశ్నిస్తూ కూడా సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ కేసు ఫైట్ చేస్తోందన్నారు. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం అమలను నిలదీస్తూ కూడా సుప్రీంలో కేసు వేశామన్నారు. ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ బద్దతను ప్రశ్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టులో పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు.
The INC’s challenge of the CAA, 2019 is being heard in the Supreme Court.
The INC’s challenge of the 2019 amendments to the RTI Act, 2005 is being heard in the Supreme Court.
The INC’s challenge to the validity of the amendments to the Conduct of Election Rules (2024) is being…
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 4, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

