సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించనున్న రాహుల్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పంజాబ్‌లోని మాన్సా గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా హత్యకు గురైన సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సోమవారం రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, హర్యానా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ డాక్టర్ అశోక్ తన్వర్ సహా పలువురు మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబాన్ని ఓదార్చారు.
ఈ సందర్భంగా అశోక్ తన్వర్ మాట్లాడుతూ సిద్ధూ చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించాడన్నారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడని, అలాంటి మహోన్నత కళాకారుడి అకాల మరణం ఆయన కుటుంబానికే కాకుండా.. కోట్లాది మంది అభిమానులకు తీరని లోటన్నారు. హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, మూసేవాల హత్యకు కారకులైన నిందితులకు కఠిన శిక్ష పడుతుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

