Ghulam Nabi Azad | బీజేపీని గెలిపించేది కాంగ్రెస్సే : గులాం నబీ ఆజాద్
Ghulam Nabi Azad | కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ‘డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP)’ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని చూస్తే విచిత్రమైన భావన కలుగుతున్నదని అన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే కొన్నిసార్లు బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమోనని అనుమానం కలుగుతుందని చెప్పారు.
Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ‘డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP)’ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని చూస్తే విచిత్రమైన భావన కలుగుతున్నదని అన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే కొన్నిసార్లు బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమోనని అనుమానం కలుగుతుందని చెప్పారు.
పార్టీలో సంస్థాగతమైన మార్పు కోసం గతంలో 23 మంది నేతలు పోరాడారని, కానీ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం వారి మాటలు వినిపించుకోలేదని తెలిపారు. సమస్యలు లేవనెత్తినప్పుడు మేమంతా బీజేపీ భాష మాట్లాడుతున్నామని హైకమాండ్ విమర్శించేదని చెప్పారు. కానీ కాంగ్రెస్ హైకమాండే బీజేపీ గెలుపును కోరుకుంటున్నట్లు తనకు చాలాసార్లు అనిపించిందని అన్నారు.
ఈ దేశంలో పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రధాన సమస్యలని గులాం నబీ ఆజాద్ చెప్పారు. కాగా, సుమారు రెండేళ్ల క్రితం ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడారు. అప్పట్లో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రాకతో పార్టీ పతనం మొదలైందని మండిపడ్డారు. పరిణతి లేని ఆయన నాయకత్వం వల్లే భారమైన హృదయంతో పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు తేవాలని, క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తూ కొందరు సీనియర్లు (జీ-23 గ్రూపు) గతంలో సోనియా గాంధీకి లేఖ రాశారు. అది అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ నాయకుల్లో ఆజాద్‌తో పాటు కపిల్ సిబల్ తదితరులు ఉన్నారు. కాగా, ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆజాద్.. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ – రాజౌరీ స్థానం నుంచి పోటీ పడుతున్నారు.
మరోవైపు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా అదే స్థానం నుంచి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అనంతనాగ్-రాజౌరీలో ఇద్దరు మాజీ సీఎం మధ్య ప్రధాన పోటీ నెలకొననుంది. జమ్ముకశ్మీర్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలకు విడివిడిగా ఐదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో దశలో పోలింగ్ నిర్వహించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

